జాతీయం

కర్ణాటకకు కొత్త సీఎం.. కాంగ్రెస్ లో ముసలం?

కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వ్యవహారం హస్తం పార్టీలో సెగలు రేపుతోంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు ఉన్నాయనే చర్చ జాతీయ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 2023 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. అయితే ఆ సమయంలో సీఎం పదవి కోసం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీ పడ్డారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనే టాక్ వచ్చింది. డీకేను సీఎంగా ప్రకటిస్తే సిద్దరామయ్య సహకరిస్తారా లేదా అన్న ఆందోళనలు హస్తం పార్టీలో కనిపించాయి.

హైకమాండ్ రంగంలోకి దిగి కర్ణాటక ముఖ్యమంత్రి రేసును కొలిక్కి తెచ్చింది. సిద్దరామయ్యను మరోసారి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ఖరారు చేసింది. పీసీసీ చీఫ్ గా డీకేను కొనసాగించింది. సీఎం రేసు విషయంలో హైకమాండ్ సమక్షంలో సిద్దరామయ్య, డీకే మధ్య ఓ డీల్ జరిగిందని ఆ సమయంలోనే ప్రకటించారు. ఆ డీల్ ప్రకారం మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉంటారు. మిగితా మూడేళ్లు డీకే శివకుమార్ సీఎంగా ఉంటారు. ఈ రాజీ ఫార్మూలాకు ఇద్దరు నేతలు అంగీకరించారని తెలుస్తోంది.

సీఎం పోస్ట్ కోసం అప్పట్లో జరిగిన డీల్ ప్రకారం సిద్దరామయ్య రెండేళ్ల పదవి కాలం మార్చితో ముగియనుంది. దీంతో తనకు సీఎం పోస్ట్ అప్పగించాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో సిద్దరామయ్య, డీకే మధ్య కోల్డ్ వార్ సాగుతుందని తెలుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివ కుమార్ సీఎం అవ్వడం 100% ఖాయం.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరని కర్ణాటక కాంగ్రెస్ మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు. సీఎం పోస్ట్ అనేది కష్టపడితే వచ్చేది.. దానికి డీకే శివ కుమార్ అర్హుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button