తెలంగాణ

మానసిక, శారీరక దారుఢ్యానికి కరాటే శిక్షణ ఎంతో అవసరం: హీరో సుమన్

ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సినీ నటుడు తల్వార్ సుమన్ సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట సత్యానగర్ లోని ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యొద్ధ గోజుర్యు స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తల్వార్ సుమన్ మాట్లాడుతూ కరాటే శిక్షణతో మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాస్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన కరాటే విద్యార్థినీ విద్యార్థులకు బెల్టులు, షీల్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తల్వార్ సుమన్ ను శాలువలు, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎన్.లక్ష్మారెడ్డి, డైరెక్టర్ కె.శారదారెడ్డి, లోటస్ ల్యాప్ స్కూల్స్ అధినేత కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, యొద్ధ గోజుర్యు స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు జి.విఠల్, చైర్మన్ బి.రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎం.రఘుకుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.తివారి, కరాటే సీనియర్ మాస్టర్లు పి.ఎం.రాము, కె.మహేష్, తీగల శ్రీనివాస్, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో కవిత హంగామా.. స్కూటీలతో నిరసన

ప్రభాస్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు వైరల్!.. మండిపడుతున్న అభిమానులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button