
-
మాజీ కౌన్సిలర్ సోదరుడికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు
-
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బంటి
క్రైమ్ మిర్రర్, ఆదిభట్ల: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి రాందాస్‌పల్లిలో మాజీ కౌన్సిలర్ దయాకర్ సోదరుడు కంతి కిషన్ మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిషన్ మరణం కలచివేసిందన్నారు. ఆయన మృతి తీవ్ర లోటు అని అన్నారు. కిషన్ మానవతా విలువలతో, సామాజిక సేవతో అందరి మనసులో నిలిచారని ప్రశాంత్ రెడ్డి స్మరించుకున్నారు.