జాతీయం

క్యాన్సర్ తో పోరాడి గెలిచిన కన్నడ హీరో!..

క్రైమ్ మిర్రర్ : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారి నుండి కోలుకున్నాడు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న శివరాజ్ కుమార్ తాజాగా పూర్తిగా కోలుకున్నారంటూ తన భార్య ఒక వీడియోని విడుదల చేసింది. అందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో పాటుగా తన భార్య గీత కూడా ఉంది. తాజాగా ఆయనకు క్యాన్సర్ ఫ్రీ రిపోర్టు వచ్చిందంటూ దాదాపుగా క్యాన్సర్ నుండి కోలుకున్నట్లే అని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read : ప్రారంభమైన టెట్‌ పరీక్షలు.. 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష

కాగా ఇతను క్యాన్సర్ బారిన పడడంతో పాటుగా విదేశాలకు వెళ్లి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్న విషయం కూడా తానే స్వయంగా అప్పట్లో వెల్లడించాడు. తాజాగా పూర్తిగా కోల్కున్నట్లుగా ఆమె భార్య వీడియో విడుదల చేయడంతో శివ రాజ్ కుమార్ ఫ్యాన్స్ అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించినట్లుగా తన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : మరో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తెలంగాణ పోలీసులకు ఏమైంది!

కన్నడ స్టార్ హీరో అలాగే దిగంగత నేత పునీత్ రాజ్ కుమార్ సోదరుడైనటువంటి శివరాజ్ కుమార్ కూడా కన్నడలో స్టార్ హీరో. వీరిద్దరికి కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉంది. జైలర్ సినిమాతో పాటుగా కొన్ని తెలుగు సినిమాల లో ఈ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించారు. కొద్దికాలం గా క్యాన్సర్ తో పోరాడుతున్న శివకుమార్ తాజాగా క్యాన్సర్ బారి నుండి కోల్కున్నారని తెలియగానే అతని ఫ్యాన్స్ అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కెనడాలో చాలామంది ఫ్యాన్స్ అతడిని దేవుడిలా భావిస్తారు.

ఇవి కూడా చదవండి : 

  1. మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్‌ బాత్ రూముల్లో కెమెరాలు!
  2. వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
  3. పేదలకు గుడ్ న్యూస్… ఒక్కొక్కరికి ఆరు కిలోలు సన్న బియ్యం!!
  4. ముందడుగు వేసిన ప్రభాస్!… డ్రగ్స్ పట్ల అభిమానులకు సందేశం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button