
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత అభిమానులు ముద్దుగా పిలుచుకునే కేన్ మామ అలియాస్ కెన్ విలియమ్సన్ అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్ జట్టుకు మాజీ కెప్టెన్ అయినటువంటి విలియమ్సన్ 2011లో టి20 ల్లో డెబ్యూ చేశారు. ఇతను టీ20లో మొత్తంగా 93 మ్యాచ్ లు ఆడగా 2575 పరుగులు చేశారు. ఇక ఇందులో 18 హాఫ్ సెంచరీ లు ఉండగా t20 లలో సెంచరీలు ఒకటి కూడా చేయలేదు కేన్ విలియంసన్. టి20 లలో కెన్ విలియమ్సన్ హైయెస్ట్ రన్స్ 95 పరుగులు మాత్రమే. రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలో కేన్ విలియమ్స్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ ప్రకటించడానికి నాతో పాటు జట్టుకు కూడా ఇదే సరైన సమయము అని పేర్కొన్నారు. దీంతో కేన్ విలియమ్సన్ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది అటు న్యూజిలాండ్ జట్టుతో పాటుగా ఇటు భారత్ కేన్ మామ ఫ్యాన్స్ కు కూడా చేదు వార్త అనే చెప్పాలి. అయితే టెస్టులు మరియు వన్డేలలో విలియమ్సన్ ఎంతటి విధ్వంసకర ప్లేయర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అతడు టెస్టులలో మైదానంలో దిగితే ఎన్నో బంతులు ఆడి తక్కువ పరుగులు చేసిన.. వికెట్ మాత్రం నిలపడంలో మొదట ఉంటాడు. న్యూజిలాండ్ దేశవ్యాప్తంగా ఎంతో మంది కెన్ విలియమ్సన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వార్త వారందరికీ కూడా ఒక చేదువార్త గానే మిగిలిపోయి ఉంటుంది.
Read also : కెన్యాలో తీవ్ర విషాదం.. 21 మంది మృతి, 30 మంది గల్లంతు!
Read also : ఈ రోజైనా గెలుస్తారా.. టీమిండియాకు ఏం తక్కువయింది?





