
Kamakshi Bhaskerla: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తన కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిని చేరుకుంది. ‘మా ఊరి పొలిమేర’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో పరిచయమై, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, అందరికి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘రౌడీ బాయ్స్’, ‘వీరూపాక్ష’ వంటి హిట్టు చిత్రాల్లో నటించడం ద్వారా తన పాపులారిటీని మరింత పెంచి, వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. ఆమె తన ప్రతిభతో టాలీవుడ్‌లో యువతలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.
ప్రస్తుతం కామాక్షి కొత్తగా ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తయి, నవంబర్ 21న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కామాక్షి ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజాగా ప్రమోషన్స్ సమయంలో కామాక్షి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా ఆరాధన పాత్రలో నటించిందని, ఈ పాత్ర లేకపోతే కథ పూర్తిగా నిలబడేది లేదని తెలిపారు. విజయ్ సేతుపతి, శ్రీవిష్ణు, సుహాస్.. ఇలా చాలామంది హీరోలు అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. హీరోయిన్లు అలా ఎందుకు చేయకూడదని ఓ సవాల్‌గా తీసుకుని ఈ పాత్ర చేశాను. ‘‘సినిమా చూసిన తర్వాత నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని కామాక్షి పేర్కొన్నారు. ఆమె తన ఐదేళ్ల కెరీర్‌లో ‘విరూపాక్ష’, ‘పొలిమేర’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిందని, మరింత విభిన్న పాత్రల్లో ప్రయత్నించాలని వెల్లడించారు.
అయినప్పటికీ కామాక్షి తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లపై కూడా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తున్న ఆమె, ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కూడా భాగంగా ఉన్నట్టు, త్వరలో ఆ వివరాలను అధికారికంగా వెల్లడిస్తారని చెప్పారు. అదేవిధంగా, ‘పొలిమేర-3’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ అన్ని పనులు ఆమె కెరీర్‌లో మరింత బలాన్ని అందించనున్నాయి.
ALSO READ: యువకుడి పై 4 అమ్మాయిలు గ్యాంగ్ రేప్..?





