
-
రాష్ట్ర భవిష్యత్ కోసమే కాళేశ్వరం, మల్లన్నసాగర్ నిర్మాణం
-
రైతులకు మేలు జరగాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష
-
కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: హరీశ్‌రావు
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ వంటిదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రైతులకు మేలు జరగాలన్న కాంక్షతోనే కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా మిగిలిపోతారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఏపీకి సర్ అర్థర్ కాటన్… తెలంగాణకు కేసీఆర్
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై దవళేశ్వరం బ్యారేజీని కట్టి గోదావరి జిల్లాల ప్రజల్లో సర్ అర్థర్ కాటన్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని హరీశ్ రావు అన్నారు. సర్ అర్థర్ కాటన్‌పై కూడా కమిషన్లు వేశారని… అయినా కానీ ఏమీ చేయలేకపోయారని హరీశ్ అన్నారు. రైతులకు మేలు చేయాలన్నదే ఇరువురి ఉద్దేశమని అన్నారు. చరిత్రపుటల్లో కేసీఆర్ నిలవడం ఖాయమన్నారు హరీశ్.
పోలవరం కూలితే ఎన్డీఎస్‌ఏ పోలేదెందుకు?
గోదావరి నది మీద ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిపోతే ఎన్డీఎస్‌ఏ పోలేదు, కానీ మేడిగడ్డ బ్యారేజీ మీద మాత్రం పిలవకుండానే ఎన్డీఎస్‌ఏ వచ్చిందని హరీశ్ ఆక్షేపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్ళీ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వం రాజకీయ కుట్రనేనని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నిజమైతే.. ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టేనన్నారు హరీశ్. ఎందుకంటే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వమన్నారు.
కాళేశ్వరం రిపోర్ట్ మొత్తం ట్రాష్
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 650 పేజీలపై చర్చ పెట్టాలన్నారు హరీశ్‌రావు. శాసనసభలో రేవంత్ సర్కార్‌ను చీల్చి చెండాడతామని హెచ్చరించారు. శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం ట్రాష్ లాగా ఉందని దుయ్యబట్టారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు.. కానీ అలాంటివి ఏవీ న్యాయస్థానాల్లో నిలబడలేదన్నారు.
ఇవీ చదవండి