
-
రేవంత్‌తో భేటీ అయిన మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణ
-
భేటీలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ ప్రశాంత్
-
కాళేశ్వరం కమిషన్‌కి, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రశాంత్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదిక సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్ అందజేశారు. రేవంత్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణ, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ ప్రశాంత్ పాటిల్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను రేవంత్‌కు ఉత్తమ్ అందజేశారు. అయితే రేవంత్‌తో భేటీలో స్పెషల్ సీఎస్ ప్రశాంత్ పాటిల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్‌కి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కర్తగా ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు.
కమిషన్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలు, నిర్మాణ వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై పలు సంచలన విషయాలు ఉన్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం నివేదిక అధ్యయనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
Read Also: