క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. కబాలి సినిమాకు నిర్మాతగ వ్యవహరించిన కృష్ణ ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేపీ చౌదరి చనిపోవడానికి గల కారణాలను ఆయన అనుచరులు చెప్పారు. తాజాగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగానే కేపీ చౌదరి సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా అతని అనుచరులు చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణ ప్రసాద్ చౌదరి 2016లో సినిమా పై ప్రేమతో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇతను తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతకు వ్యవహరించారు. కాగా ఇతను 2023 వ సంవత్సరంలో ఇతని దగ్గర 93 గ్రాముల కోకైన్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి కారణంగానే ఇప్పుడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని అనుచరులు చెబుతున్నారు. పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు విచారణలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
1.తెలంగాణలోని జిల్లాలకు కొత్త బిజెపి అధ్యక్షులు వీళ్లే?
2.ఢిల్లీలో ప్రచారాలు చేయనున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు?
3.అన్నపూర్ణగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చేశారు?