ఆంధ్ర ప్రదేశ్

జర్నలిస్టులను రైలు పట్టాలపై పండబెడుతా.. టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. బహిరంగగానే ధమ్కీలు ఇచ్చారు. ఏకంగా జర్నలిస్టులపై వార్నింగ్ ఇచ్చాడు. తన పై వివాదాలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడుతానని టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరించాడు.

అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బరితెగించాడు. మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చాడు.మీడియా అంటే తనకు లెక్కలేదన్నారు. నేను అన్ని చేసి వచ్చిన వాడిని.. రాసుకోండి. ఏం రాసుకుంటారో అని తేల్చి చెప్పారు. గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా కాకుండా రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జయరాం వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపాయి. జర్నలిస్టులకు ఎమ్మెల్యే జయరాం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జయరాంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు జర్నలిస్ట్ సంఘాల నేతలు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button