ఆంధ్ర ప్రదేశ్రాజకీయం
Trending

జనసేన ఆవిర్భావ దినోత్సవం నేడే… లక్షల్లో తరలిరానున్న అభిమానులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు అంటే మార్చి 14 ఈ రోజున జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం చాలా ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేయడం జరిగింది.

మహిళల ఆత్మరక్షణకు కరాటే అవసరం : శంకరపల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కు బయలుదేరనున్నారు. 3:45 నిమిషాలకు సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించి, జనసేన లోని నాయకులను ఉద్దేశించి … భవిష్యత్తులో జనసేన ఎలాంటి అభివృద్ధి, గుర్తింపు పొందబోతుందో అనేది తెలియజేస్తూ ప్రసంగించనున్నారు. ఇక కార్యక్రమం అనంతరం రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు.

కాబట్టి ఈ జనసేన 12వ ఆవిర్భావ కార్యక్రమం కు లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నేత కార్యకర్తలు రానున్నారు. ఆ లెక్కను మనం ఎవరూ కూడా ఊహించలేము. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందే చాలా మంది అభిమానులు అతను పెట్టే సభలకు వచ్చేవారు… మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ కోసం అభిమానులతో పాటుగా జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను, భారీ పోలీసు బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే..

రేపే మహిళల ఐపీఎల్ ఫైనల్!… ఢిల్లీ ఈసారైనా కప్పుకొట్టేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button