
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు రోజురోజుకి కూడా మలుపు తిరుగుతున్నాయి. పార్టీ ఏదైనా కూడా విమర్శలు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. ఇందాకటి వరకు రోజా ప్రతిపక్ష పార్టీలపై ఎంతగా ఫైర్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వైసీపీ నేత రోజాపై నేడు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. మాజీ మంత్రి రోజాపై మండిపడుతూనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి రోజా తాజాగా కూటమి నాయకులను ఉద్దేశించి ‘ ఎమ్మెల్యే నా కొడుకులు అంటూ’… వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భం ని గుర్తు చేసుకున్నా బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు రోజా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రోజా ఆడనా?.. మగనా?.. అని బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. అలాంటప్పుడు జగన్ కూడా రోజా కొడుకేనా?.. అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేనే… అప్పుడు చంద్రబాబు వయసు ఎంత?.. రోజా వయసు ఎంత?… కాస్త పద్ధతిగా మాట్లాడాల్సిన పని లేదా అని అన్నారు.
వైసీపీ పార్టీలోని కొందరు కాపు నేతలను కావాలనే ఉసిగొలిపి దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసురుతున్నారని… తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు వేలకోట్ల కుంభకోణాలు చేశారు అని అన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్ ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బులిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు రాష్ట్ర రాజకీయాలలో మళ్లీ సెగ గాలులు రేకెత్తాయి.
మళ్లీ రెచ్చిపోయిన రోజా… జగన్ గెలిస్తే ఒక్కొక్క నా కొడుకు అమెరికా పారిపోతారు?
శ్రీశైలంలో మళ్లీ మోగిన ‘సైరన్’… ఏ క్షణమైనా గేట్లు ఎత్తొచ్చు?