
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహించడంతో కొన్ని కాలనీలో నీట మునిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. మూసి వరదతో MGBS తో పాటుగా పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలో చిక్కుకుపోయాయి. అయితే ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. భారీ వర్షాలు నేపథ్యంలో వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. మూసి వరదతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం అందించే కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు అలాగే జనసేన శ్రేణులు ప్రభుత్వానికి అండగా ఉండాలని.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం చేయాలని కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ పై పలు రకాలుగా ప్రశంసలు వస్తున్న మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. మొదట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించండి అని ఏపీ వాసులు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చేపడుతున్న కార్యక్రమాలకు శభాష్ అని ప్రశంసిస్తున్నారు.
Read also : భారత్ కు పరుగుల “అభిషేకం”… పాకిస్తాన్ కు చుక్కలే!
Read also : దుంగలు దొరికాయి.. మరి దొంగలు ఏమైనట్టు?