
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రపంచంలో కొంతమంది సినిమాలు తీయడంలో ఆరితేరి ఉన్నారు. చాలామంది డైరెక్టర్లు తనకు నచ్చినటువంటి సినిమా కథతో సినిమా రంగంలోకి ప్రవేశించి ఎన్నో సినిమాలను బ్లాక్ బస్టర్ చేశారు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎవరికి సాధ్యం కానటువంటి… ఎవరు కూడా ప్రయత్నం చేయని విధంగా ఆలోచించి టాలీవుడ్ నుంచి డైరెక్టర్గా తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి మన ఇండియాలో ఉన్నటువంటి నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అతను ఎంచుకునే కథ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తీసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాజమౌళి ఎవరు చేయని సాహసం చేసి ఒక ఈగతో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు.
తాజాగా దర్శకు ధీరుడు అయినటువంటి రాజమౌళి తీసిన సినిమాల్లో అతనికి నచ్చినటువంటి ఈ సినిమా ఏది అని ఎవరికి తెలియకపోవచ్చు. అయితే తాజాగా దీనికి సమాధానం దొరికింది. నిన్న జరిగినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చారు. సాధారణంగా రాజమౌళి తీసిన సినిమాలలో రాజమౌళికి ఏది ఇష్టమని ఫ్యాన్స్ని అడగగా.. ప్రతి హీరో అభిమాని కూడా కొంతమంది మగధీర అని, ప్రభాస్ అభిమానులు బాహుబలి లేదా చత్రపతి అని, ఎన్టీఆర్ అభిమానులు సింహాద్రి లేదా RRR అని.. అలా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెబుతుంటారు. కానీ రాజమౌళి మాత్రం తన కెరీర్లో నేను తీసినటువంటి బెస్ట్ ఫిలిం నాని నటించిన “ఈగ” సినిమా అని జక్కన్న తన మనసులోని మాటను బయటకు అన్నారు.