
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలు జరిగిన తుక్కిసులాట ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ దుర్ఘటనలో ఎంతోమంది భక్తులు మరణించడం చాలా బాధగా ఉంది అని.. ఇది అత్యంత విచారకరమని ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన కుటుంబాలను మాత్రమే కాకుండా.. గాయపడిన కుటుంబాలను కూడా ప్రభుత్వమే దగ్గరుండి మరి ఆదుకోవాలి అని.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన చికిత్స అందించాలి అని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి. 18 నెలలపాటు వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు సరైన జాగ్రత్తలను తీసుకోవట్లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసమర్థపాలనకు ఇది ఒక నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఒక విషయం పైన దృష్టి పెట్టడం కాదు.. కార్తీక మాసం అని తెలిసి.. దేవాలయాలకు భక్తులు ఎక్కువగా వెళ్తారని తెలిసి కూడా ఎందుకు ఆలయ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని మండిపడ్డారు.
Read also : పెండింగ్ లో 900 కోట్లు.. మూడవ తేదీ నుంచి కాలేజీల బంద్!
Read also : తెలుగుదేశం అనే పార్టీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు : సీఎం





