
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గత వైసిపి పాలనలో యూరియా కోసం అన్నదాతలు ఎన్నడూ కూడా రోడ్డు ఎక్కలేదని.. మరి ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నీ సొంత నియోజకవర్గం కుప్పంలోనే అంత దారుణమైన పరిస్థితి నెలకొంటే మిగతా నియోజకవర్గపు ప్రజల పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డి నేడు కుప్పం నియోజకవర్గం ప్రజలు రోడ్లపై నిల్చుని ఉన్న ఫోటోలను ప్రెస్ మీట్ ద్వారా చూపిస్తూ… ఈ పరిస్థితికి కారణమేంటో చెప్తారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు రైతులు ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. కుప్పంలో పరిస్థితి చాలా దారుణంగా తయారైందని.. యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పకొచ్చారు.
Read also :వైసీపీలోకి అడుగుపెట్టనున్న వర్మ.. వార్తల్లో నిజమెంత?
“చంద్రబాబు… ఎందులోనైనా దూకి చస్తే బెటర్” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చె న్నాయుడు టెక్కలి నియోజకవర్గం లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గత మా ప్రభుత్వంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇన్ని ఇబ్బందులు సృష్టించిన వారు బావి లాంటిది ఏదైనా చూసుకొని దూకి చస్తే బెటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలని… మా ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బంది జరిగిందా అనేది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా చావమని అనడం ఎంతవరకు సమంజసం అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
Read also : యువత మరణాలకు కారణాలు ఇవే!.. ‘వన్ లైఫ్’ సంచలన విషయాలు