
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ కు రానున్నారు. అక్రమాస్తుల కేసుల విషయంలో కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాదుకు వచ్చారు. తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ రానుండడంతో.. వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ కూడా బేగంపేట విమానాశ్రయం వద్దకు భారీగా వచ్చి చేరుకున్నారు. దీంతో బేగంపేట విమానాశ్రయం వద్ద కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో భారీగా పోలీసులు చేరుకొని వారిని ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ను చూడాలని ఆశగా అభిమానులు అందరూ భారీ ఎత్తున ఎయిర్పోర్టులోకి చొచ్చుకొల్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు అలాగే అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున మొహరించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు తగ్గేదేలే అని సోషల్ మీడియాలో చర్చ మొదలు అయింది. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లోకి వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పరుగులు పెడుతూ వెళ్లడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మరోవైపు కోర్టు దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అధికారంలో లేకపోయినా జగన్ కు భారీ స్థాయిలో అభిమానుల ఫాలోయింగ్ ఉందంటూ చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : New Aadhaar: త్వరలో కొత్త ఆధార్.. దీని ప్రత్యేక ఏంటంటే?
Read also : ఢిల్లీలో గాలి కాలుష్యం.. ఈ దుస్థితి రావడానికి కారణాలు ఇవే!





