
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- ఇటలీ దేశంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మిక కొరత ఎక్కువగా ఉందని.. తాజాగా ఆ దేశమే స్వయంగా ప్రకటించింది. దాదాపు 5 లక్షల మందికి వీసా ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇటలీ దేశం ప్రస్తుతం జనాభా శనతా మరియు విపరీతమైన కార్మిక కొరత సమస్యలతో సతమతమవుతూ ఉంది. తాజాగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇటలీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యూరోపియన్ యూనియన్ యేతర పౌరులకు ఏకంగా ఐదు లక్షల వరకు వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించడం జరిగింది. ఇది ఆ దేశ జనాభాను స్థిర పరుస్తూ అలాగే భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా ఉండడానికి ఉపయోగపడుతుంది అని భావిస్తుంది. ఇందులో భాగంగానే దేశంలోకి వచ్చేటువంటి ఎంతోమంది వలసదారులను గణనీయంగా పెంచబోతుంది. స్థానికంగా ఉండేటువంటి లేబర్ మార్కెట్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించేలా ఏర్పాటు చేస్తుంది.
ఇటలీ దేశానికి అవసరమయ్యే రంగాలు :- ఇటలీ దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలను తెలిపింది. ఇందులో ముఖ్యంగా
1. వ్యవసాయం
2. నిర్మాణరంగం
3. వైద్యునిపుణులు మరియు నర్సులు
4. టూరిజం
5. తయారీ రంగం
6. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
7. సైబర్ సెక్యూరిటీ
8. డేటా సైన్స్ మరియు డిజిటల్ సేవల రంగం
ఈ రంగాల వ్యక్తులు ప్రస్తుతం ఇటలీ దేశానికి చాలా అవసరం. ప్రస్తుతం ఇటలీలో జననాల రేటు అనేది గణనీయంగా తగ్గుతుంది. కేవలం ఒక 2024వ సంవత్సరంలోనే 37వేల మంది జనాభా తగ్గిపోయింది. జననాల కంటే మరణాలే ఎక్కువ సంభవించాయని ఆ దేశం ప్రకటించింది.
నేడే భారత్ బంద్… వేటిపై ప్రభావం పడుతుంది!. వేటిపై పడదు?
కృష్ణా నదిపై వంతెనకు సహకరించాలి – ఏపీ సీఎంను కోరిన అచ్చంపేట ఎమ్మెల్యే