
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈరోజు అన్ని థియేటర్లలో విడుదల అయ్యింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసినవారు సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు కొనసాగిస్తూనే ఖాళీ సమయంలో ఈ సినిమాని పూర్తి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్నటువంటి మరో రెండు సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి.
లండన్ కు చేరిన ప్రధాని మోడీ.. కీలక అంశాపై ద్వైపాక్షిక చర్చలు!
అయితే నేడు సినిమా విడుదలై కొన్ని గంటలు కాకుండానే… ఈ సినిమా ఏ ఓ టి టి ప్లాట్ఫారంలో స్రీమింగ్ అవబోతుందనేది తెలిసింది. పవన్ కళ్యాణ్ మరియు నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో నడుస్తుండగా… ఈ చిత్రం ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడు ఓటీడీలో రిలీజ్ చేస్తారని డేట్ అయితే చెప్పలేదు కానీ… అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పుకొచ్చారు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. ఇక దీని ప్రకారం మనం హరిహర వీరమల్లు కూడా సెప్టెంబర్ మొదటి వారం లేదా మధ్య వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇవాళ సినిమాకు వెళ్లి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలే కదా రిలీజ్.. అప్పుడే ఓటీటి మాటలు ఏంటని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.