ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ని అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం కాదు : యాంకర్ శ్యామల

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రస్తుత టిడిపి అధినేత అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు రెండు రెండు నెలల తరువాత బెయిల్ మీద చంద్రబాబు నాయుడు బయటకి వచ్చారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయించడంలో వైసిపి పాత్ర లేదని అన్నారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించింది తమ ప్రభుత్వం కాదని తేల్చి చెప్పారు. తాజాగా అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో శ్యామల మీడియాతో ఈ వివరాలను చర్చించారు. ఆ రోజు కేంద్ర పెద్దల సూచనలతోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని చెప్పుకొచ్చారు. అప్పటి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కారణంగానే… ఆరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చంద్రబాబు అరెస్టు జరిగిందని… అంతేకాకుండా విత్ ప్రూఫ్స్ తో అరెస్ట్ చేయడం జరిగిందని వైసిపి అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పష్టంగా తెలియజేశారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ అన్ని శాఖల మంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ కు సంబంధం లేని మంత్రిత్వ శాఖలో తల దూర్చుతున్నారని శ్యామల మండిపడ్డారు. మరోవైపు తాజాగా రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టు మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై యాంకర్ శ్యామల అభ్యంతరం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్లను అరెస్ట్ చేయడం అక్రమము అని.. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా వీళ్ళందర్నీ అరెస్ట్ చేస్తున్నారని యాంకర్ శ్యామల ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను.. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు!

నక్షా పేరిట ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై భూ వివాదాలు ఉండబోవు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button