
చండూరు, క్రైమ్ మిర్రర్:-మునుగోడు నియోజకవర్గం లో కల్తీ మద్యం తెచ్చిన దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులే ఉన్నారని ఇందులో ఆయన వాటా ఎంత అంటూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు . శనివారం చండూరులో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని బెల్ట్ షాపులు రద్దు అని బాటిల్ ధరలు పెంచారని కానీ బెల్ట్ షాపులు అలాగే ఉన్నాయంటూ విమర్శించారు. ఒంటె పెదవుకి నక్క ఆశపడ్డట్టుగానే ఆయన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారని ఆయనకు మంత్రి పదవి వచ్చేది లేదని అభివృద్ధి జరిగేది లేదంటూ విమర్శలు గుప్పించారు. చండూరును సస్యశ్యామల చేస్తానని చెప్పి చండాలం చేశారంటూ మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు తానే 30 కోట్లు తెచ్చానని అలాగే అనేక గ్రామీణ రోడ్లకు మంజూరి తెచ్చానని తెలిపారు. అధికారులు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలారా పనిచేస్తున్నారని తమ కార్యకర్త జోలికి వస్తే సహించేది లేదని వచ్చేది ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వమేనని వడ్డీకి వడ్డీ చెల్లిస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని పాలు ఏంటియో నీళ్లు ఏంటో ప్రజలు తెలుసుకున్నారు అన్నారు. అభివృద్ధిని మరిచి కమిషన్లకు, సంపాదనకు ఎగబడ్డారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు హెలికాప్టర్లలో తిరిగేందుకు పోటిపడి తిరుగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకపోగా గత సంక్షేమ పథకాలను కూడా కొనసాగించే పరిస్థితి లేదని లేదన్నారు ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే వెంటనే గద్ద దిగాలని తెలిపారు.
మండల పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మరు బోయిన వెంకన్న, కొత్త పాటి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి రెడ్డి, మునగాల నారాయణరావు, తోకల వెంకన్న, గుర్రం వెంకటరెడ్డి,అన్నపర్తి శేఖర్, యత్తపు మధుసూదన్ రావు, ఉజ్జిని అనిల్ రావు, గుంటి వెంకటేశం, కురుపాటి సుదర్శన్, బొడ్డు సతీష్, తేలు కుంట్ల శేఖర్, జానయ్య, మాధగోని వెంకటేశం పెండ్యాల గీత,సువర్ణ, బోయపల్లి రమేష్, రామన్న, జగదీష్, ఇడికోజు నాగరాజ్, రామకృష్ణ, స్వామి గణేష్, సురేష్, మహేష్, శంకర్, లింగయ్య పాల్గొన్నారు.