సినిమా

రిలీజ్ అయ్యి వారం కాలేదు.. అప్పుడే మరో సినిమానా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ 2 ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా కలెక్షన్ల విషయంలో కూడా ఫుల్ జోరు కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై కరెక్టుగా వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోయపాటి మరియు బాలకృష్ణ కాంబోలో త్వరలోనే మరో సినిమా రాబోతున్నట్లుగా టీ టౌన్ వర్గాలు పూర్తిస్థాయిలో చర్చించుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును గీత ఆర్ట్స్ పట్టా లెక్కించనున్నట్లుగా పేర్కొన్నాయి. ఇక ఈ సినిమాపై అతి కొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్ చేస్తారు అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Read also : యంగ్ ప్లేయర్లకు మంచి టాలెంట్ ఉంది.. అందుకే అంత ధర పెట్టాం : CSK CEO

అయితే అది అఖండ 3న లేక మరో కొత్త సినిమానా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సింహ సినిమాతో మొదలు పెట్టుకుంటే ఆ తరువాత వచ్చినటువంటి లెజెండ్, అఖండ మరియు అఖండ 2 సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే అది అయిదవ సినిమాగా.. మరో రికార్డు సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read also : తెలంగాణలో ముగిసిన “పంచాయితీ”.. పూర్తి వివరాలు ఇవే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button