జాతీయం

ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్, ‘గగన్‌యాన్‌’లో కీలక ముందడుగు!

Gaganyaan Air Drop Test: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్ యాన్ మిషన్ లో మరో కీలక ముందడుగు పడింది. ఇస్రో తాజాగా నిర్వహించిన ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం అయ్యింది. మానవసహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారా చూట్ వ్యవస్థ పని తీరును పరీక్షించింది. ఇందులో భాగంగా చేపట్టిన  ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్-01ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

ఇంతకీ ఏంటీ ఎయిర్ డ్రాప్ టెస్ట్?

ఎయిర్ డ్రాప్ టెస్ట్ గగన్‌ యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి, దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాచూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పని చేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజా పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పారాచూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.

సమిష్టి కృషితో పరీక్ష విజయవంతం

తాజా పరీక్షలో ఇస్రో ఒక్కటే కాకుండా కాకుండా రక్షణ, పరిశోధనా సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్,  డీఆర్‌డీవో, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఈ సంస్థలన్నీ సమన్వయంతో పని చేసి క్లిష్టమైన ప్రయోగాన్ని సక్సెస్ చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button