
Israel Strikes: పశ్చిమాసియా మరోసారి భగ్గున మండింది. సిరిమా రాజధాని డామాస్కలోని రక్షణశాఖ కార్యాలయంతో పాటు సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 34 మంది గాయపడ్డారు. సిరియా అధ్యక్ష భవనానికి సమీపంలో ఈ దాడులు జరగడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సిరిమా సువేదా ప్రాంతంలోని మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ జాతీయులకు మద్దతుగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఘర్షణ
నిజానికి గత కొద్ది రోజులుగా ద్రూజ్ జాతీయులకు, సున్నీ బెడ్విన్ తెగ మధ్య ఘర్షణ మొదలైంది. సాయుధ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ద్రూజ్ జాతీయులను కాపాడేందుకు ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ద్రూజ్ జాతీయులు ఉండగా సిరియాలో సగం మంది ఉన్నారు. మిగిలినవారు ఇజ్రాయెల్, లెబనాన్ లో ఉన్నారు.
వివాదం ఎక్కడ మొదలైందంటే?
ద్రూజ్ జాతికి చెందిన ఒక కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధులు దోచుకోవడంతో గొడవ ప్రారంభమైంది. సమస్య నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చిందని స్వచ్ఛందం సంస్థలు తెలిపారు. సిరియాలో గత ఏడాది అహ్మద్ అల్ షర్రా నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తమ దేశంలోని అన్ని వర్గాలను పరిరక్షిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. కానీ దానిని నిలుపుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత, బహిర్గత దాడులు కొనసాగుతున్నాయి. సిరియా నిత్యం అల్లర్లతో అల్లకల్లోలం అవుతోంది.
Read Also: ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి, ఇరాన్ చీఫ్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు!