Wednesday, March 18, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్ టీవీపై ఇజ్రాయెల్ దాడి.. లైవ్ నుంచి లగెత్తిన యాంకర్!

ఇరాన్ టీవీపై ఇజ్రాయెల్ దాడి.. లైవ్ నుంచి లగెత్తిన యాంకర్!

Israel- Iran Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద బాంబులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లైవ్ లో యాంకర్ వార్తలు చదువుతుండగా, నెతన్యాహూ సేనలు ఆ టీవీ చానెల్ పై బాంబు వేశాయి. ఒక్కసారిగా యాంకర్ షాకయ్యింది. లైవ్ నుంచి ప్రాణ భయంతో పరిగెత్తింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాలుగు రోజులుగా కొనసాగుతున్న దాడులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు నాలుగో రోజు కూడా భీకరంగా సాయింది. టెహ్రాన్ 100కు పైగా బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ మీద ప్రతిదాడికి దిగింది. ఈ దాడిలో సుమారు 11 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు ప్రతీకారంగా టెల్ అవీవ్ రెచ్చిపోయింది. గగనతలం నుంచి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థపైనా బాంబు దాడి చేసింది. ఆ సమయంలో స్టూడియోలో ఓ మహిళా యాంకర్ ఇజ్రాయెల్ మీద తీవ్ర ఆగ్రహంతో వార్తలు చదువుతోంది. అప్పుడే బాంబు పడటంతో ఒక్కసారిగా లైవ్ లో నుంచి పారిపోయింది. లైవ్‌ లో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ పారిపోతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయంపై దాడి

నాలుగో రోజు టెహ్రాన్‌ లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయం మీద ఇజ్రాయెల్ బాంబుదాడి చేసింది. ఒక్కసారిగా బాంబు పడి భారీ పేలుడు శబ్దాలు రావడంతో లైవ్ లో వార్తలు చదువుతున్న యాంకర్ భయంతో వణికిపోయింది. వార్తలు చదవడం మానేసి, ప్రాణభయంతో పరుగులు పెట్టింది. హిజాబ్ ధరించిన మహిళా యాంకర్ తన సీటలో నుంచి లేచి పారిపోతున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. యాంకర్ అక్కడి నుంచి వెళ్లిన మరుక్షణమే స్టూడియో అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అంతేకాదు, స్టూడియోలో భవన శిథిలాలు పడుతున్నట్లు కనిపించింది.

Read Also: వెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయండి, ట్రంప్ వార్నింగ్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments