ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పాకిస్తాన్‌పై మాకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ రాయబారి రేవెన్ అజార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందానికి కూడ మద్దతు పలికిన విసయం తెల్సిందే. కాగా ఈ ఒప్పందానికి మద్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదని ఆ దేశ రాయబారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ మాట్లాడుతూ శాంతి చర్చల్లో పాక్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌ను తామూ పూర్తిగా విశ్వసించమని,పాకిస్తాన్‌ను అమెరికా సొంత ప్రయోజనాలకు మధ్యవర్తిత్వానికి ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా ఇరాన్లో తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అమెరికాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అమెరికా-మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోందన్నారు
కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ వరకే…
కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ వరకే పరిమితం అని, లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రాయబారి వెల్లడించారు . ఇరాన్‌పై జరిపిన ఆపరేషన్‌కు, లెబనాన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
