ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ కన్ఫామ్.. జట్టులోకి స్టార్ బౌలర్ ఎంట్రీ : కెప్టెన్ సూర్య

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2026 T20 వరల్డ్ కప్ కు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని అన్ని జట్లు కూడా వార్మప్ మ్యాచులు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ పై కొన్ని విషయాలను పంచుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన ఘనపరిచిన విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. ఇందులో భాగంగానే ఇషాన్ కిషన్ టాప్ 3 త్రీ లోనే బ్యాటింగ్ చేస్తారు అని.. అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్ చేయరు అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ లోను ఇషాన్ కిషన్ టాప్ 3 లోనే ఆడారు. కాబట్టి అతని స్థానాన్ని మార్చే ప్రసక్తే లేదు అని సూర్యకుమార్ యాదవ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ లో కూడా అంతే బాగా రాణిస్తారు అని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే హర్షిత్ రానా స్థానంలో స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజును ఎంపిక చేశారు. దీంతో బౌలింగ్ కూడా మరింత బలం చేకూరింది. ఇప్పటికే జట్టులో బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్స్ ఉండగా ఇప్పుడు వారికి తోడుగా సిరాజు వచ్చి చేరారు. దీంతో బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనింగ్ తో పాటుగా మంచి ఆల్రౌండర్స్ తో టీమ్ ఇండియా జట్టు చాలా బలంగా ఉంది.

Read also : Supreme Court: ఇష్టం లేకుండా గర్భం ఉంచుకోమని చెప్పలేం, సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Read also : Social Media: ఇక చిన్న పిల్లలకు నో సోషల్‌ మీడియా.. కేంద్రం సంచలన నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button