
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో హైదరాబాదు నగరం అంతా కూడా జలమయం అయింది. కొద్దిపాటి వర్షం పడినా రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నిన్ను సాయంత్రం నుంచి హైదరాబాదు నగరంలో కుండపోత వర్షాలు పడడంతో నగరవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారులు మాత్రమే కాకుండా.. సందు సందులో కూడా నీరు ఎక్కువగా నిలిచిపోవడంతో ఉద్యోగాలు నిమిత్తం బయటకు వెళ్లే ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. ఒకవైపు నీరు నిలిచిపోవడం మరోవైపు భారీ ట్రాఫిక్ అవడంతో ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆయా కంపెనీలను కోరుతూ ఉన్నారు.
Read also : ఓట్ల చోరీ ఆరోపణలు.. రాహుల్ పై ఈసీ తీవ్ర వ్యాఖ్యలు!
అయితే వీళ్ళందర్నీ దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ అధికారులు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ సామాన్యులతో పంచుకున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు రోడ్లమీద నీరు నిలిచిపోయిన, లేదా వరద సమయంలో ఏదైనా సాయం అవసరమైతే వెంటనే ఆయా సమస్యలకు సంబంధించి కంట్రోల్ నెంబర్స్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ కు తక్షణమే కాల్ చేసి వివరాలను అందించవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎటువంటి సహాయమైనా చేయడానికి సిద్ధమే అని దాదాపు 16 నెంబర్లను విడుదల చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా NDRF కంట్రోల్, ICCC కంట్రోల్, HYDRAA కంట్రోల్ అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్, సైబరాబాద్ కంట్రోల్ వంటి ముఖ్య హెల్ప్ లైన్ నెంబర్స్ పంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సహాయాన్ని కోరవచ్చు అని అధికారులు వెల్లడించారు. అన్ని రకాల కంట్రోల్ బృందాల హెల్ప్ లైన్ నెంబర్లను అధికారులు ప్రకటించారు. కాబట్టి సహాయం కోసం చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరారు.
Read also : ఓట్ల చోరీ ఆరోపణలు.. రాహుల్ పై ఈసీ తీవ్ర వ్యాఖ్యలు!