ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

Pawankalyan : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విజయోత్సాహంలో ఉన్నారు. జనసేన (JANASENA) ఆవిర్భావ వేడుకల్లో ఆయన చేసిన ప్రసంగం… ఆయన ఆనందానికి అద్దం పడుతోంది. 11ఏళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చిందని.. ఓటమికి కుంగిపోకుండా… నిలబడ్డామని అన్నారు. జనసేన నిలబడటమే కాదు… నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీని బతికించామని… రాష్ట్రంలో, దేశంలో ఎన్డీయేని నిలబెట్టామని గర్వంగా చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. జనసేనకు 11ఏళ్లు పూర్తయ్యే సరికి… వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(Ysr Congress) పార్టీకి 11 సీట్లే మిగిల్చామన్నారు. తమను తక్కువచేసి మాట్లాడిన వారిని చావుదెబ్బ కొట్టామన్నారు.

పార్టీ ప్రస్తానం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్‌ కళ్యాణ్‌. ముందంతా చీకటే ఉన్నా… దారంతా గోతులు, అగాధులు ఉన్నా.. చేరుకోవాల్సిన ఇల్లు దూరంగా ఉన్నా… 2014లో అంతా తానై జనసేన పార్టీ పెట్టానని చెప్పారాయన. ఓటమి భయం లేదుకనుకే 2019లో పోటీచేశామని.. ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. నిలదొక్కుకుని… టీడీపీ( TDP Party) ని నిలబట్టామన్నారు. వైసీపీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేసి… జబ్బలు చరిచారని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబును కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారన్నారు. జనసేన నాయకులు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేలా చేశారని… తనలాంటి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని ఛాలెంజ్‌లు విసిరారన్నారు. అలాంటి వారికి గట్టిగా సమాధానం చెప్పామన్నారు పవన్‌ కళ్యాణ్‌. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టామన్నారు పవన్‌ కళ్యాణ్‌. దేశమంతా తలతిప్పి తమవైపు చూసేలా 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించామన్నారు.

ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, పవన్‌ కళ్యాణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. జనసేన ఫ్యూచర్‌ ప్లాన్‌కు అద్దం పడుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. జనసేనకు తెలంగాణ జన్మస్థలం అయితే… ఏపీ కర్మస్థలమని అన్నారు. అంతేకాదు… హిందీ, తమిళ్‌, కన్నడ, మరాఠాలో మాట్లాడిన ఆయన… ఆ రాష్ట్రాల్లో కూడా జనసేనకు అభిమానులు ఉన్నారని చెప్పారు. తమిళనాడు పర్యటనకు వెళ్తే.. ఎంతో అభిమానించారన్నారు. అలాగే… మహారాష్ట్రకు వెళ్లినప్పుడు సినిమా పరంగా కాకుండా.. రాజకీయపరంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందన్నారు. హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున తాను ప్రచారం చేశానని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఒక్క సీటు తప్ప.. తాను ప్రచారం చేసిన అన్ని ఎన్నికల్లో గెలిచామన్నారు. అలాగే… ఛత్రపతి శివరాజ్‌ మహారాజ్‌ ప్రస్తావన కూడా తెచ్చారు పవన్‌. కర్నాటకలోని జనసేన అభిమానులకు.. కన్నడ భాషలోనే నమస్కారాలు చెప్పారు. ఇన్ని రాష్ట్రాల గురించి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ప్రస్తావించినట్టు అంటే… జనసేన భవిష్యత్‌ను ఆయన చెప్పకనే చెప్పారా..? ఆంధ్రప్రదేశ్‌తో ఆగిపోము… తెలంగాణతోపాటు… దేశం మొత్తం జనసేనను విస్తరిస్తామని పవన్‌ హింట్‌ ఇచ్చారా..? వచ్చే ఎన్నికల్లో NDA కూటమితో కలిసి.. ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తారా…? ఏమో అయ్యిండొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read More : వర్మ.. ఇదేం ఖర్మ – నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ ట్రోల్స్‌ – అధిష్టానం స్పందించదా..?

బీజేపీతో పవన్‌ కళ్యాణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆయనకు గౌరవం ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినవి.. పవన్‌ కళ్యాణ్‌ను పిలిపించి ప్రచారం చేయిస్తున్నారు. బీజేపీ సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమాలకు కూడా పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. మోడీ, అమిత్‌షాతో కలిసి పవన్‌ వేదిక పంచుకున్నారు. ఇందంతా చూస్తే… జనసేన భవిష్యత్‌ ప్లాన్‌.. చాలా పెద్దగా ఉందని.. 12వ ఆవిర్భావ సభలో పవన్‌ చెప్పకనే చెప్పారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button