ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన - తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం

టీడీపీ, జనసేన.. మిత్రపక్ష పార్టీలు. ప్రభుత్వంలో భాగస్వాములు. కానీ.. ముందు స్నేహం, వెనుక వైరం అన్నట్టు ఉంది ఈ రెండు పార్టీల తీరు. మేమంతా ఒకటే.. కలసే నడుస్తాం.. కలిసి ముందుకెళ్తాం… కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాలని… ప్రతీసారి ఎక్కాలు ఒప్పజెప్తారు. కానీ.. రియాల్టీ మాత్రం వేరుగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు… జనసేన నేతలను కలుపుకుని పోతారామో గానీ… జనసేన ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ నేతలను దూరం పెడుతున్నారు. ఇది బహిరంగ సత్యం. తిరుపతి చంద్రబాబు పర్యటన సందర్భంగా.. టీడీపీ, జనసన మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది.

సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా.. చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వస్తున్నారంటే… ఆ పార్టీ నాయకులు హడావుడి చేస్తారు. నాయకుడికి స్వాగతం పలుకుతూ.. వారి పేరుపైఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెడతారు. కానీ.. తిరుపతి టీడీపీ నేతలకు ఆ ఛాన్స్‌ దొరకలేదు. ఎక్కడా వారి పేరు మీద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపించలేదు. ఎందుకు ఫ్లెక్సీలు పెట్టుకోలేదు.. అంటే.. వారు పెట్టుకోవడం కాదు… తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెట్టనివ్వలేదు అనే మాట వినిపిస్తోంది.

Read More : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా

ఆరణి శ్రీనివాసులు.. చిత్తూరుకు చెందిన నాయకుడు. సామాజికవర్గం పరంగా తిరుపతిలో జనసేనకు బలం ఉంది కానీ.. అభ్యర్థి లేకపోవడంతో.. ఎన్నికలకు ముందు చిత్తూరు నుంచి ఆరణి శ్రీనివాసులను తీసుకొచ్చి జనసేన అభ్యర్థిగా నిలబెట్టారు. ఆరణి శ్రీనివాసులు ఆర్థికంగా బలవంతుడు. అయితే.. ఆరణిని తిరుపతి అభ్యర్థిగా నిలబెట్టడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకురాలు సుగుణమ్మ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు ఆమెను పిలిపించి మాట్లాడి సర్దిచెప్పారు. ఆరణి శ్రీనివాసులు తిరుపతి నుంచి కూటమి అభ్యర్ధిగా నిలబెట్టి.. గెలిపించారు. అయితే… ఎమ్మెల్యే అయినప్పటి నుంచి… టీడీపీ నేతలను దూరం పెడుతున్నారట ఆరణి శ్రీనివాసులు. ముఖ్యంగా… ఎన్నికల సమయంలో తనను వ్యతిరేకించిన టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాడట. చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ నేతల ఫ్లెక్సీలు కనిపించకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు.

తిరుపతి టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు… టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశాడట ఆరణి శ్రీనివాసులు. దీంతో.. అధినేత వస్తున్నా.. వెల్‌కమ్‌ చెప్తూ ఫ్లెక్సీలు పెట్టుకోలేని దుస్థితి తిరుపతి టీడీపీ నేతలది. ఫలితంగా… చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యేకు దగ్గ‌రగా ఉన్న ఒక టీడీపీ నేత ఫ్లెక్సీలు మాత్రమే కనిపించాయి. అధికార పార్టీలో ఉన్నా… ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని తిరుపతి టీడీపీ నేతలు వాపోతున్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి మాటలు చెప్పడం తేలికే… కానీ ఆచరణే శూన్యం అన్నట్టు ఉంది టీడీపీ-జనసేన మైత్రి.

Read More : జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!

తిరుపతిలో టీడీపీ నేతలను తొక్కేస్తున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల గురించి… సీఎం చంద్రబాబుకు తెలియకుండానే ఉంటుందా..? తెలిసీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? జనసేన ఎమ్మెల్యే తీరును ఎందుకు ఖండించడంలేదు..? ఇది మైత్రిలో భాగమా లేక.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా…? ఒక్క తిరుపతిలోనే కాదు… ఒకట్రెండు మినహాయిస్తే… జనసేన ఎమ్మెల్యేలు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల పరిస్థితి ఇదే.

ఇవి కూడా చదవండి .. 

  1. అసెంబ్లీ వేదికగా మందకృష్ణ మాదిగను ప్రశంసలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్!..

  2. అమరావతిలో వివిధ కంపెనీలకు భూములు కేటాయింపులు…

  3. పదవి వచ్చింది.. మరి బాధ్యతలో..! – ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎదురుచూపులు

  4. 2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?

  5. ప్రక్షాళన జరిగితేనే వైసీపీకి లైఫ్‌ – తుక్కు ఏరకపోతే పార్టీ నిలబడటం కష్టమే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button