
Khamenei on Israel: ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి లాంటిదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లా, ఆ దేశం చెప్పినట్టల్లా ఆడుతోందని విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్, త్వరలో అమెరికాతో ఆణు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఇరు దేశాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ తో గొప్పగా పోరాడాం
అటు తాజాగా జరిగిన యుద్ధంలో ఇరాన్.. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ తో గొప్పగా పోరాటం చేసిందని ఖమేనీ చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ను నమ్మలేమని అనుమానం వ్యక్తం చేశారు. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులు చెప్పేందుకు ఇరాన్ రెడీగా ఉందని తేల్చి చెప్పారు.
12 రోజుల పాటు కొనసాగిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్
రీసెంట్ గా ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఇరు దేశాలు పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డాయి. ముఖ్యంగా ఇరాన్ లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలువురు ఆణు శాస్త్రవేత్తలు, డిఫెన్స్ అధికారులు, పలువురు పౌరులు చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ లో సుమారు వెయ్యి మందికి పైగా మృతి చెందారు. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్ పై జరిపిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. ఇరాన్ ఆణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులో విరుచుకుపడింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంధి కుదిరేలా చేసింది. ఇరు దేశాల అంగీకారంతో కాల్పుల వివరమణ జరిగింది. అయితే, తరచుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ తో పాటు అమెరికాపై నిప్పులు చెరుగుతున్నారు.
Read Also: చైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!