
Iranian Hackers Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఇరాన్ హ్యాకర్లు ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కీలక రహస్యాలతో కూడిన ట్రంప్ స్నేహితుల ఈమెయిల్స్ ఇప్పటికే హ్యాక్ చేయగా, ఇప్పుడు వాటిని బయటపెడతామని బెదిరింపులకు దిగారు. రాబర్ట్ అనే పేరుతో ఓ మీడియా సంస్థకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అమెరికా పత్రికలు వార్తలను ప్రచురించాయి.
ఏకంగా 100 జీబీ ఈమెయిల్స్ హ్యాక్
ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ స్నేహితులతో పాటు హౌట్ హౌస్ లోని కీలక అధికారుల ఈ మెయిల్స్ ను ఇరాన్ హ్యాకర్లు తస్కరించారు. ఈమెయిల్స్ హ్యాక్ అయిన వారిలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, ట్రంప్ లాయర్ లిండ్సే హాలిగన్, ప్రెసిడెంట్ సలహాదారు రోజర్ స్టోన్ తో పాటు మరికొందరి ఈమెయిల్స్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 100 జీబీ డేటా ఉన్నట్లు తెలిపారు. వాటిన త్వరలోనే బహిర్గతం చేయనున్నట్లు రాబర్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ వాటిని బయటకు లీక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. ఇరాన్ హ్యాకర్ల బెదిరింపులపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ రియాక్ట్ అయ్యారు. జాతీయ భద్రతకు విఘాతంగా మారే ఎవరినైనా చట్ట ప్రకారం వదిలిపెట్టమన్నారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో బయటకొచ్చిన హ్యాకింగ్ వ్యవహారం
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరల్లోనే రాబర్ట్ హ్యాక్స్ గురించి విషయం బయటకు వచ్చింది. ఆ సమయంలో ట్రంప్ సన్నిహితుల ఈ మెయిళ్లను హ్యాక్ చేసినట్లు రాబర్ల్ ప్రకటించారు. అయితే, ఈ రాబర్ట్ ఆపరేషన్స్ ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తోందని అమెరికా ఆరోపించింది. అయితే, ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత తాము ఎలాంటి లీక్స్ చేయడం లేదని తెలిపింది. కానీ, రీసెంట్ గా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ మీద దాడి చేయడంతో మళ్లీ ఈ మెయిల్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే, వీటిలో ఏ రహస్యాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఈ మెయిల్స్ లీక్ అయితే ట్రంప్ కు ఏ తలనొప్పి వస్తుందోనని వైట్ హౌస్ ఆందోళన చెందుతోంది.
Read Also: ముగ్గురు పిల్లల్ని కనండి.. మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!