Homeఅంతర్జాతీయం‘హర్మూజ్ జలసంధి’ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం!

‘హర్మూజ్ జలసంధి’ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం!

Hormuz Strait Close: ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలనం నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అణు స్థావరాలపై దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆయిల్ మార్కెట్ కు కీలక మార్గం అయిన ఈ జలసంధిని మూసివేయాలనే నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. శత్రుదేశాలపై ప్రతీకాన్ని తీర్చుకోవడంతో పాటు ప్రపంచదేశాల మద్దతు కోసం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

20 శాతం చమురు రవాణా ఇక్కడి నుంచే!

ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ ఆయిల్ అవసరాల్లో ఏకంగా 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్ కు చెందిన ముసాండ ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఈ జలసంధి ఉంది. దీనిలో ఒకచోట కేవలం 33 కిలో మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి రోజూ 2 కోట్లకుపైగా బారెల్స్ ఆయిల్స్ పలు దేశాలకు వెళ్తుంది. ముఖ్యంగా సౌదీ, ఇరాన్, యుఎఇ, కువైట్, ఇరాక్ నుంచి ఆయిల్ ఎగుమతులు అవుతాయి. ఎల్పీజీ రవాణాకు కూడా ఇది అత్యంత కీలకం, మూడింట ఒకవంతు ఎల్పీజీ ఇక్కడి నుంచే విదేశాలకు రవాణా అవుతుంది.

ఇండియా పైనా తీవ్ర ప్రభావం

ఇరాన్ హర్మూజ్ జలసంధి మూసివేత నిర్ణయం భారత్ మీద కూడా తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత అవసరాలకు సంబంధించి 90 శాతం ముడి చమురు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందులో ఏకంగా 40 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. అంతేకాదు, ఈ జలసంధి మూసివేత కారణంగా భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: ఇరాన్ పై దాడులు.. అమెరికాను టార్గెట్ చేసిన రష్యా!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments