క్రీడలు

నేడే IPL ప్రారంభం… యువకులకు ఒక విన్నపం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025 నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు ఈరోజు ఒక పండుగ లాంటిదని చెప్పాలి. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఆర్సీబీ మరియు కేకేఆర్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇన్ని రోజులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు ఈరోజు నుంచి దాదాపుగా రెండు నెలలపాటుగా ఎంజాయ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు కొన్నిటిపై నిఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు క్రికెట్ పై బెట్టింగు వేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు పై పోలీసు అధికారులు ఒక కన్నేసి ఉంచారు. పట్టణాలు, నగరాలు మొదలుకొని మారుమూల గ్రామాలలో కూడా యువత బెట్టింగ్ కు అలవాటు పడిపోయారని… కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యువత ఇలాంటి బెట్టింగ్ వాళ్లలో పడగొద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా సరే బెట్టింగ్ కు అలవాటు పడి ఈ వ్యసనంలో మునిగి తేలినట్లయితే కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా సైబర్ మోసాలు ఎక్కువ అయిపోయాయి. కాబట్టి మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ద్వారా యువత ఎక్కువగా బెట్టింగ్లకు పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లోని పలుచోట్ల పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేశారు. బెట్టింగ్ వేస్తున్నట్లుగా ఎవరైనా పోలీసులకు చికితే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి యువత ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించండి కానీ బెట్టింగ్ లోకి ఎంటర్ కావద్దని హెచ్చరిస్తున్నారు. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button