క్రైమ్

నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

  • నిందితుల నుంచి భారీగా నగదు, ఆభరణాలు స్వాధీనం

  • ఈ ముఠాపై తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు కేసులు

  • వివరాలు వెల్లడించిన నల్గొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి

  • సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి అభినందనలు

క్రైమ్‌మిర్రర్‌, నల్గొండ: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నల్గొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ దొంగతనాలకు పాల్పడుతూ, ప్రజలను బెంబేలెత్తిస్తున్న ముగ్గరు నేరస్థులు బీసపోగు శాంసన్‌, కండరకొండ కృష్ణకిషోర్‌, దర్మడి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు పంపామన్నారు.

వీరంతా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. వీరిపై ఏపీ, తెలంగాణలో 28 కేసులు నమోదయ్యాయన్నారు. తాజాగా మరో 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరి నుంచి రూ.12లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నవాటిలో 115.50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, రూ.25వేల నగదు, ఒక ఫోన్‌, మరో బైక్‌ ఉన్నాయి. పోలీసులు సమన్వయంతో పనిచేసి నిందితులను అరెస్ట్‌ చేశారన్నారు.

నల్గొండ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌రెడ్డి, నల్గొండ వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, డిండి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బీసన్న నేతృత్వంలోని పోలీసు బృందానికి డీఎస్పీ అభినందనలు తెలియజేశారు. కేసులో సమర్థవంతంగా ఛేదించిన సీసీఎస్ ఎస్‌ఐలు శివకుమార్, విజయ్ కుమార్, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇవి చదవండి:

  1. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం… త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌!

  2. ఏపీలో సెగ పుట్టిస్తున్న రాజకీయాలు.. సీఎంకు వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button