సంక్రాంతి అనగానే అందరికీ కూడా బంధువులు,చలిమంట, గాలిపటాలు మరియు కోడిపందాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటన్నిటిలో ప్రతి ఒక్కరు కూడా కోడిపందాలకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా కోడిపందాలలో విచిత్రంగా పోరాడకుండానే తెలివిగా గెలిచినా ఒక కోడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఒకప్పుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ యాడ్ చూసి ఉంటాం. ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే సేమ్ అలానే ఓ పందెంకోడి ఎటువంటి పోరాటం చేయకుండానే గెలిచింది.
సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన దుండగుడు!..
ఈ కోడిపందాలు ఎక్కడ జరిగాయో తెలియదు కానీ ఐదు కోళ్లు బరిలో దింపగా నాలుగు కోళ్ళు ఒకదానిపై ఒకటి విరోచితంగా దాడి చేసుకుని నేలకోరిగాయి. కానీ అందులో ఒక కోడి మాత్రం మొదటి నుంచి ఒకే చోట సైలెంట్ గా నిల్చుని విజేతగా నిలిచింది. మొదటి నుండి కూడా ఆ కోడి మరో నాలుగు కోళ్లు దాడి చేసుకుంటుండగా చూస్తూనే ఉంది. కానీ చివరికి ఆ నాలుగు కోళ్లు కూడా రక్తంతో పడిపోవడంతో మిగిలి ఉన్న అయిదో కోడి విజేతగా నిలిచింది. దీంతో ఎటువంటి పోరాటం చేయకుండానే ఉన్నచోటనే నిల్చుని విజేతగా నిలిచిన ఆ కోడి ఓనర్లు తెగ సంతోషించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోడిని చూసి చాలా తెలివిదని అనుకోగా మరి కొందరు మాత్రం ఎప్పటికైనా అది కూరల మారాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.