
Infosys Work Hours: వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు కారణం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేశారు. వేల కొద్ది మీమ్స్ క్రియేట్ చేశారు. చివరకు టీవీ షో ప్రోమోలు కూడా ఆయనను ట్రోల్ చేస్తూ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల వర్క్, లైఫ్ బ్యాలెన్స్ పై కీలక సూచనలు చేసింది. ఓవర్ టైమ్ పని చేయకూడదని సూచించింది. ఈ మేరకు ఓవర్ టైమ్ పని చేస్తున్న ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపిస్తోంది. హెల్త్ మీద ఫోకస్ పెట్టాలని సూచిస్తోంది.
ఇన్ఫోసిస్ లో 3.23 లక్షల మంది ఉద్యోగులు
ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటిగా కొనసాగుతోంది. ఈ కంపెనీలో సుమారు 3 లక్షలకు పైగా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీలో ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్ కు వచ్చి పని చేయాలి. మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అయితే, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం, సరిగా తినకపోవడం, నిద్రలేమి, అనారోగ్యం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుండె, కంటి సంబంధ సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కీలక సూచనలు చేసింది. ఉద్యోగులు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని వెల్లడించింది. వర్క్ కంప్లీట్ కాగానే కుటుంబంతో గడపడం లేదంటే విశ్రాంతి తీసుకోవడం చేయాలని చెప్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపిస్తున్నది.
Read Also: బెదిరింపులకు భారత్ తలొగ్గదు, తేల్చి చెప్పిన జైశంకర్!