
Indonesia Mount Lewotobi Laki Laki: ఇండోనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి పేలింది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న ఈ అగ్ని పర్వతం, నెల వ్యవధిలో రెండోసారి బద్దలైంది. ఇండొనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి.
18 కిలో మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న బూడిద
అగ్నిపర్వతం విస్పోటనం కారణంగా సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడుతోంది. సమీప గ్రామాలన్నీ బూడితో నిండిపోయాయి. అగ్నిపర్వతం పేలడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అయితే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. బాలికి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులను దారి మళ్లించాల్సి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
నెల రెండోసారి విస్పోటనం
లకి లకి అగ్ని పర్వతం 1,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తరచుగా పేలుతూ ఉంటుంది. కానీ, ఈసారి నెల వ్యవధిలో రెండోసారి పేలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత నెల 18న కూడా ఈ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఏడాది మార్చి 21న కూడా పేలింది. గతేడాది నవంబర్ లో పేలిన సమయంలో తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డరు. ఈ అగ్ని పర్వతంలో ఇంకా పేలుళ్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్వతానికి ఏడు కిలోమీటర్ల వరకు అధికారులు ఆంక్షలు విధించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపారు.
Read Also: జిన్ పింగ్ పదవీ విరమణ.. వార్తల్లో అసలు నిజం ఎంత?