
•ఇళ్ల నిర్మాణాల్లో విమర్శలకు తావివ్వోదు
•స్థోమతలేని లబ్ధిదారులను గుర్తించాలి
•మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి
•మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
•పలు రికార్డులు పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
• మర్రిగూడెం ఎంపిడిఓ మునయ్య కు షోకాజ్ నోటీసులు జారీ
మునుగోడు (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో విమర్శలకు ఆరోపణలకు తావివ్వోదు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు..మునుగోడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు ,గృహనిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమములో ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించడంతోపాటు పీ ఏం ఏ వై గ్రామీణ్ ఆన్లైన్ ఎంట్రీ వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన మర్రిగూడ ఎంపిడిఓ మునయ్య కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..ఇండ్ల గ్రౌండింగ్ సోమవారం నాటికి 50 శాతం పురోగతి తీసుకురావాలని అన్నారు.ఇల్లు మంజూరు అయ్యి కట్టుకునేందుకు ఆర్ధికంగా స్థోమతలేని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రోత్సహించాలని సూచించారు..ఇళ్ల విషయములో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు..మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు..ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు,ఓపీ,వివిధ రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు..చండూరు ఆర్డీఓ శ్రీదేవి, గృహ నిర్మాణశాఖ పిడి రాజ్ కుమార్, ఎంపీడీవో లు,తహశీల్దార్ లు,పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు..
Read also ఇందిరమ్మ ఇల్లు అర్హులకు అందేలా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Read aslo స్టోరీ మొత్తం ఒకే పార్ట్ లో చెప్పే స్కోప్ ఉన్న పార్ట్ 2 గా ఎందుకు సాగదీస్తున్నారు?