
Railways Ticket Prices Hike: చాలా ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే టికెట్ల ధరలను సవరించింది. స్వల్పంగా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి(జులై 1) నుంచి టికెట్ ధరలు అమలు కానున్నాయి. రైల్వే సేవల స్థిరత్వాన్ని మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఎక్స్ ప్రెస్, మెయిల్, ఏసీ, నాన్ ఏసీ క్లాసులకు సంబంధించిన ధరలను స్వల్పంగా పెంచినట్లు తెలిపింది. సబర్బన్ రైళ్ల ధరలను పెంచడం లేదని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొనుగోలు చేసే టికెట్లకు కొత్త ధరలు అమలు అవుతాయని తెలిపింది. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపారు. కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే PRS, UTS, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థలను పూర్తిగా ఆధునీకరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పెరిగిన టికెట్ ధరల వివరాలు ఇవే!
నాన్-ఏసీ క్లాసులు
సెకండ్ క్లాస్:
*500 కిలోమీటర్ల వరకు ధరలో ఎలాంటి మార్పులు ఉండవు.
*501-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రూ. 5 పెంపు.
*1501-2500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 పెంపు.
*2501-3000 కిలోమీటర్ల దూరానికి రూ. 15 పెంపు.
*కిలో మీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు.
స్లీపర్ క్లాస్: కిలో మీటరుకు 0.5 పైసలు పెంపు.
ఫస్ట్ క్లాస్: కిలో మీటరుకు 0.5 పైసలు పెంపు.
నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసులు:
సెకండ్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెంపు.
స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెంపు.
ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెంపు.
Read Also: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే?