
Ceasefire Violation: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. దాయాది దేశం నుండి ఎటువంటి కవ్వింపు జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు భారత సైన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. “పూంచ్ ప్రాంతంలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి కొన్ని మీడియా, సోషల్ మీడియా నివేదికలు వచ్చాయి. నియంత్రణ రేఖ వెంబడి ఎటువంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు. దయచేసి అవాస్తవా సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండండి” అని ఆ ప్రకటనతో ఇండియన్ ఆర్మీ తెలిపింది.
పాక్ కాల్పులకు పాల్పడిందంటూ వార్తలు
అంతకుముందు, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని పలు చానెల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కాల్పులకు దిగిదంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు, భారత సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోందని వార్తలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పింది.
4 రోజుల దాడుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం
ఇక భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత నాలుగు రోజుల పాటు ఇరు దేశాలు పరస్పర డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. మే 10న పాక్ డీజీఎంవో విజ్ఞప్తితో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీని ఫలితంగా రెండు దేశాలు ప్రస్తుతం సంయమనంతో ఉన్నాయి.
Read Also: నాటి న్యూస్ క్లిప్ షేర్ చేస్తూ.. ట్రంప్ పై ఇండియన్ ఆర్మీ ఆగ్రహం!