జాతీయం

కుప్పకూలిన భారత వాయుసేన విమానం, ఒకరు మృతి

  • రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో ప్రమాదం

  • భనుడాలో కుప్పకూలిన ఐఏఎఫ్‌ విమానం

  • ఘటనాస్థలిలో సహాయ బృందాల రెస్క్యూ

క్రైమ్‌ మిర్రర్‌, ఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం రాజస్థాన్‌లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐఏఎఫ్‌ విమానం నడుపుతున్న పైలట్‌ దుర్మరణం పాలయ్యాడు. రాజస్థాన్‌లోని చూరు జిల్లాలోని భనుడా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. విమానం నడుపుతున్న పైలట్‌ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయ బృందాలు ఘటనాస్థలంలో రెస్య్కూ మొదలుపెట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై నిపుణులు అన్వేషిస్తున్నారు. విమాన శకలాలను పరిశీలిస్తున్నారు.

Back to top button