India Warns Citizens on Iran Situation: ఇరాన్ లో గత కొద్ది రోజులుగా హింసాత్మక నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ కీలక అడ్వయిజరీ జారీ చేసింది. అదే సమయంలో ఇరాన్ లోని భారత పౌరులు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పింది. స్థానిక అధికారులు, వార్తా సంస్థల అప్‌డేట్స్‌ను ఎప్పుటికప్పుడు ఫాలో కావాలన్నది.
భారత రాయబార కార్యాయంలో టచ్ లో ఉండండి!
అటు టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్స్ నుంచి సమాచారం చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో రెసిడెంట్ వీసాపై ఇరాన్‌లో ఉంటున్న భారత పౌరులు ఇప్పటికే భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ కాకపోతే వెంటనే చేసుకోవాలని ఎంఈఏ సూచించింది. నిరసనల దరిదాపుల్లోకి కూడా పోకూడదన్నది. ఒకవేళ అక్కడి ఆందోళనలల్లో కేసులు నమోదైతే భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత పౌరులు ఎవరూ అక్కడి నిరసనల్లో తలదూర్చకూడదన్నారు.
ఇరాన్ లో నిరసనలకు కారణం ఏంటంటే?
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రజల్లో నిరసన అంతకంతకూ తీవ్రమవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజులకు పైగా ఇరాన్ అంతా అల్లర్లతో అట్టుడుకుతోంది. త్వరలోనే ఖమేనీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.





