India Today C-Voter Survey: భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని దేశాలు భారత ప్రధానిని ఉన్నత స్థాయిలో చూస్తున్నారు. అన్ని దేశాల అధినేతలు భారత్ ను గొప్పగా గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరింత బలపడిందని ఇండియా టుడే, సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్-2026 జనవరి’ సర్వే తేల్చింది. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకం ఏమాత్రం సడలలేదని పేర్కొంది.
ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 352 సీట్లు
ఇండియా టుడే, సీ ఓటర్ సర్వేలో మోడీ ఇమేజ్ తో పాటు ఎన్డీయే బలం మరింత పెరిగిందని తేలింది. దేశ వ్యాప్తంగా గత 8 వారాల్లో 1.25 లక్షల మందిని సర్వే చేసి అంచనా వేసిన ఈ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేశారు. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార ఎన్డీయే కూటమికి 352 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. 2024లో ఈ కూటమి మెజారిటీకి అవసరమైన 272 సీట్లనూ సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ సొంతంగా 287 సీట్లు గెలిచి మళ్లీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని సర్వే తేల్చింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 182 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది.





