
భారత్-పాక్ మధ్య ఇవాళ కీలక సమావేశం జరిగింది. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో తదనంతర పరిస్థితిపై ఇరు దేశాలు చర్చించాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ DGMOల మధ్య వర్చువల్‌గా ఈ చర్చలు జరగనున్నాయి..ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ DGMO లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయని తెలుస్తోంది. కాగా POK ని అప్పగించడంపైనే చర్చిస్తామని పాకిస్తాన్‌కు భారత్ స్పష్టం చేసింది.
శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించిన కొన్నిగంటల్లోనే పాక్ సైన్యం ఉల్లంఘించింది.