
- మధ్య రాత్రి 1గం. 40 నిమిషాలకు పంజాబ్ లోని ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.
- 26 పైగా ప్రాంతాల్లో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్
- శ్రీనగర్ లోని స్కూల్స్ ను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్
- ఆసుపత్రులను. పౌరులను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతుందన్న ఆర్మీ
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేస్తుందన్న ఆర్మీ
- పంజాబ్, రాజస్థాన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ విఫలయత్నం
- పాకిస్తాన్ డ్రోన్ దాడులను ఫైటర్ జెట్లతో తిప్పికొట్టామన్న ఆర్మీ
కల్నల్ సోఫియా ఖురేషి:
పాకిస్తాన్ పంజాబ్‌లో హైస్పీడ్ క్షిపణిని ప్రయోగించింది.
పాక్.. భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది..
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్:
పాకిస్తాన్ 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది..
శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్‌లోని ఆసుపత్రి, పాఠశాల మౌలిక సదుపాయాలపై పాకిస్తాన్ దాడి చేసింది..
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి
పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేవి, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయి..
భారత పై దాడులు గురించి పాక్ వాదనలు అబద్ధాలు.. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుంది..
భారత్.. ఆఫ్ఘనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంది..భారతీయ క్షిపణులు ఏవీ ఆఫ్ఘనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకోలేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తెలుసు.. ఏ దేశం.. తమని లక్ష్యంగా చేసుకుంది..
=