
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మండలం లోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు.
Read also : మనదేశ భవిష్యత్తు మన బాలలపైనే ఉంది : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.
Read also : మనదేశ భవిష్యత్తు మన బాలలపైనే ఉంది : ఎమ్మెల్యే కోమటిరెడ్డి