
IND vs ENG 5th Test: ఓవల్ టెస్ట్ రసపట్టులో కొనసాగుతోంది. విజయానికి భారత్ 4 వికెట్ల దూరంలో ఉండగా, ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉంది. ఐదో రోజు తొలి సెషన్ లోనే విజేత ఎవరో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజే ముగుస్తుందనుకున్నా.. చివరలో వర్షం రావడంతో ఐదో రోజుకు చేరింది. అయితే హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్భుత శతకాలతో ఇంగ్లండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అటు చివరి సెషన్‌లో కేవలం 57 పరుగుల కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును భారత పేసర్లు వణికించారు. ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి భారత్ విజయంపై ఆశలు రేపాడు. అయితే వర్షం రావడంతో గంటన్నర ముందుగానే ఆటను ముగించారు.
5 రోజు తొలి సెషన్ లోనే విజేత ఖరారు!
విజయానికి ఇంగ్లండ్ 35 పరుగుల దూరంలో ఉండగా.. భారత్ మరో 4 వికెట్లు తీయాల్సి ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 339/6 స్కోరుతో ఉండగా.. క్రీజులో జేమీ స్మిత్ (2), ఒవర్టన్ (0) ఉన్నారు. ప్రసిద్ధ్ కు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. సోమవారం తొలి గంట ఆట ఇరు జట్లలో విజయం ఎవరిదో తేల్చనుంది.
ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ డ్రా!
ప్రస్తుతం జరుగుతున్న అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ముందంజలో ఉంది. 2-1తో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్ ఫలితం బట్టి సిరీస్ డ్రాగా ముగుస్తుందా? లేదంటే ఇంగ్లాండ్ వశమవుతుందా? అనేది తేలనుంది. ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ విజయానికి మరో 35పరుగులు అవసరం. భారత్ గెలుపునకు 4 వికెట్లు కావాలి.
Read Also: రూట్, ప్రసిద్ కృష్ణ మధ్య గొడవ.. అండగా నిలిచిన KL రాహుల్!