
IND Vs ENG 3rd Test: లార్డ్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా కొనసాగిన మూడో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. జోరూట్ (104) సెంచరీ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ (100) సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 192 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 193 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ, భారత జట్టు కేవలం 170 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్), కేఎల్ రాహుల్ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
ఈ నెల 23 నుంచి నాలుగో టెస్ట్
జడేజా.. బుమ్రా, సిరాజ్ తో కలిసి టీమిండియాను గెలిపించేందుకు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. 74.5 ఓవర్‌లో షోయబ్ బషీర్ బౌలింగ్ లో సిరాజ్ అవుట్ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది. షోయబ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ పై నుంచి క్రీజులో పడి స్టంప్స్‌ను తాకింది. బంతి వికెట్లను తాకడంతో సిరాజ్ ఔటయ్యాడు. మూడో టెస్టులో భారత ఓటమి ఖాయం అయ్యింది. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.
Read Also: భర్తతో విడాకులు, సైనా సంచలన ప్రకటన!