
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భం రాజకీయ వేడిని పెంచుతుంది. ఎలక్షన్ల సమయం వరకు రాష్ట్రంలో ఎన్నో విమర్శలు సందర్భాలను మనం చూసాం. కానీ నేడు అవి ఎలక్షన్ల తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఇక తాజాగా కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. 2025-26 కు సంబంధించి ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించినటువంటి కాగ్ నివేదికను తాజాగా జగన్మోహన్ రెడ్డి X వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక జీఎస్టీ, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయాలు 3.47 పర్సెంట్ మాత్రమే పెరిగాయని తెలిపారు. ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు సహా మొత్తం ఆదాయం 6.14% మాత్రమే పెరిగింది అని… మరోవైపు కేవలం మూడు నెలల్లోనే అప్పులు మాత్రం 15.61% పెరిగాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు.
ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే.. రోజుకు 4000 అడుగులు నడవాల్సిందే!
“సృష్టి” టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల సోదాలు: డా. నమృత అరెస్ట్, కీలక పత్రాల స్వాధీనం